రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేల వినియోగంపై సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా పరిమితికి మించి సౌండ్ సిస్టమ్లు వాడకూడదని స్పష్టం చేశారు. అసభ్యకరమైన పాటలు, రెచ్చగొట్టే పాటలు, రాజకీయపరమైన పాటలను ప్లే చేయరాదని హెచ్చరించారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన డీజేలు, పెద్ద బాక్సులను వినియోగించకూడదని సూచించారు.