సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో ఆదివారం కూడా వినాయక నిమజ్జనం సందడి కొనసాగింది. భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను చెరువు కట్టపైకి తీసుకురాగా, మున్సిపల్ సిబ్బంది వాటిని నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. చెరువు కట్టపై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.