ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో గత నెలలో నీటి కుంటలో పడి ఆరు మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు పరామర్శించి 50వేల రూపాయల చొప్పున 3 లక్షల రూపాయలు అందజేశారు. చిగిలి గ్రామపంచాయతీ కట్టపై కార్యక్రమం నిర్వహించి వారు అందజేశారు.