వికారాబాద్ జిల్లా కేంద్రంలో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది, మూడు రాత్రులు అనంతరం ఈరోజు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాయకుని రామయ్య గూడా రోడ్డు వెంబడి ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని నిత్యజీవితంలో అదొక భాగంగా ఏర్పాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని తెలిపారు.