గుంతల మయంగా మారిన రోడ్డు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడం జరిగింది. దీంతో అటు నుండి వెళ్లే వాహనదారులు వాహనాలు గుంతల్లో దిగబడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టుకు వినాయక నిమజ్జనానికి వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గుంతల్లో మట్టి పోసి వదిలేస్తే ఎలా అని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని బుధవారం తెలిపారు.