మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి.. కడపజిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ సమాధి వద్ద కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులర్పించారు.. అలాగే వైఎస్ సతీమణి విజయమ్మ.. వైఎస్ భారతి రెడ్డి.. ఇతర కుటుంబ సభ్యులు.. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.. తండ్రి విగ్రహానికి పూలమాల సమర్పించడంతో పాటు.. వివిధ రకాల పూలతో అలంకరించిన సమాధి వద్ద జగన్ ప్రణమిల్లి నివాళులు అర్పించారు.