జిల్లా అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాభివృద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన జిల్లా కలెక్టరుగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ అనుభవాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, మీ సూపర్ విజన్ తో జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా అధికారులందరూ ఒక టీమ్ గా పనిచేసి, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు లక్ష్యసాధనలో గడువుకు ముందే ప్రగతిని సాధించాలని స్పష్టం చేశారు.