శుక్రవారం మొహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని నెల్లూరులో జరగబోవు శాంతియుత ర్యాలీపై ముస్లిం నేతలు సమీక్ష జరిపారు. దీనికి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజిజ్ హాజరయ్యారు. గత 1500 ఏళ్లగా మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంటుందని అజిజ్ అన్నారు. నెల్లూరులో 40 ఏళ్ల నుంచి ఈ పర్వదినాన శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తారని, శాంతి ర్యాలీలో కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పిలుపునిచ్చారు.