మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో పాల్గొని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సర్కిల్ పరిధిలో అనేక చోట్ల రోడ్లపై గుంతలు పూడ్చలేదని, వాటిని వెంటనే పూర్చాలని అనుకోరారు. అలాగే వాటర్ వర్క్స్ తో సమన్వయం చేసుకొని రోడ్లపై డ్రైనేజీ సిల్ట్ ను శుభ్రం చేయాలని కోరారు. అనేక చోట్ల పారిశుద్ధ్యం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.