రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజి భరత్ తెలిపారు. బుధవారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని వినాయక చవితి పురస్కరించుకొని పలు మండపాలను ఆయన పర్యటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో తొమ్మిది రోజులపాటు వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని మట్టి వినాయకుని పూజిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో సుపరిపాలన కొనసాగుతుందని తెలిపారు.