రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ఆర్టీసీ బస్‌స్టాండు వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపారు. చింతూరు ఆర్టీసీ బస్‌స్టాండులో ఎస్ ఐ రమేష్ ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా రవాణా చేస్తున్న 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ గోపాలకృష్ణ తెలిపారు.