ఓర్వకల్లు మండలం పుడిచెర్లలో శ్రీరామ లింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ, చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. శుక్రవారం ముఖ్యఅతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే చరితారెడ్డి సూచించారు. కూటమి గ్రామ, మండల నాయకులు, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.