మండపేట తహశీల్దార్ కార్యాలయంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ తేజేశ్వరరావు అధ్యక్షతన మండపేట టౌన్ సీఐ సురేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని, నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అధికారులు పేర్కొన్నారు