పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సొంత భవనాలు నిర్మించాలని శుక్రవారం ఉదయం 11 గంటలకు కోరారు.