షీ టీమ్స్ మహిళ రక్షణే లక్ష్యంగా, బాధిత మహిళలకు అండగా అందుబాటులో ఉంటుందనే భరోసా కల్పించాలని డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో షీ టీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు షీ టీమ్స్ కు 114 ఫిర్యాదులు అందాయని, ఇందులో 18 మందిపై క్రిమినల్ కేసులు, ఏడుగురిపై పెట్టి కేసులు నమోదు చేసి 89 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.