ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా శనివారం కల్లూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో సెట్కూరు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెట్కూరు సీఈఓ డా.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై విద్యార్థులలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రాణాలను రక్షించడంలో ప్రథమ చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. డాక్టర్లు విజయ్ కుమార్, ఆనంద్, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.