కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ని తగ్గించాయని తగ్గించిన ప్రకారమే వస్తువులను విక్రయించాలని దుకాణదారులకు కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సానియా తార ఆదేశించారు. ఆమె మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తో కలిసి సోమవారం తాడిపత్రి లోని పలు షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జీఎస్టీ ని తగ్గించిన ప్రకారం ప్రతి షాపు ముందు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా జీఎస్టీ విధానాన్ని తెలియజేయాలన్నారు.