ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని సిద్దన్నపాలెంలో శ్రీ సుబ్బం పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ బండ్లు కట్టారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి కుంకుమ బండ్లు గట్టి భక్తితో పూజలు చేస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. వడ్డే రాజులందరూ కలిసి శ్రీ సుబ్బం పేరంటాలమ్మ తల్లికి పూజలు జరిపి పంటలు బాగా పండాలని జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు పెద్దలు తెలిపారు.