సోంపేట టౌన్లో ఎలక్షన్ ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై బి. హైమావతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపించేందుకు ప్రజలు పోలీసువారికి సహకరించాలని అన్నారు. అల్లర్లు, గొడవలు లేకుండా పోలీసు వారికి సహకరించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.