గరివిడి పోలీస్ స్టేషన్ ను గురువారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణం పరిశీలించిన అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులు సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా నిఘాను మరింత పెంచాలని సూచించారు. పేకాట కోడి పందాలు నిర్వహించే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. చీపురుపల్లి డి.ఎస్.పి రాఘవులు ఎస్బిసిఐ ఏవీ లీలారావు చీపురుపల్లి సిఐ జి శంకర్రావు గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.