నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాక ప్రస్తుతం నీటిమట్టం 585.10 అడుగులుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టుకు అవుట్ ఫ్లో 2,57,178 క్యూసెక్కులు కాగా , ఇన్ ఫ్లో 2,47,161 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.0450 టీఎంసీలు అని తెలిపారు.