శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి మందలించాడని, మంగళవారం ఉదయం పట్టణ నడిబొడ్డున ఉన్న నాగావళి నది కొత్త బ్రిడ్జ్ పైనుంచి నదిలో దూకాడు. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాల వ్యాపారి గమనించి, తన వాహనం వెనుక ఉన్న తాడును వెంటనే నదిలోకి విసిరాడు. విద్యార్థి ఆ తాడును నడుముకు కట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని ప్రాణాలతో కాపాడారు. దీంతో బ్రిడ్జ్ కు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.