జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి గ్రామంలో 353సీ జాతీయ రహదారిపై యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. గారేపల్లిలో శనివారం గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు ఆధార్ కార్డులు, పట్టా పుస్తకాల జిరాక్స్ పేపర్స్ ఉంచి యూరియా వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా స్టాక్ ఉన్నప్పటికీ దుకాణం తీయడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.