శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం 233 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి డివిజన్ నుంచి 62, పెనుకొండ 91, ధర్మవరం 44, కదిరి నుంచి 36 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.