పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అమరావతి మండల కేంద్రంలోని శ్రీ బాలా చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పసుపు కుంకుమ జాకెట్ ముక్క కొబ్బరికాయ వంటి పూజ సామగ్రిని అమ్మవారికి సమర్పించారు.