రాయలసీమను రతనాలసీమగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని మంత్రి సవిత అన్నారు. బుధవారం పెనుకొండ మండలం కియా ఎదురుగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారని, స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్ ఆంజనేయులు, నియోజకవర్గ పరిశీలకు నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు