మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బైల్ పై వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల పరిశీలకుడు, తాడిపత్రి వైసిపి నేత కొనుదుల రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు తాడిపత్రి నియోజకవర్గంలోని రాజకీయాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో చర్చించినట్లు సమాచారం.