సత్తెనపల్లిలోని లక్ష్మీ టాకీస్ వద్ద ఉన్న టీ స్టాల్లో మస్తాన్ అనే వ్యక్తి బుదవారం దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి మస్తాన్పై అతి కిరాతకంగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.