ఏటూరునాగారం-రాజుపేట వరకు ప్రధాన రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని CPM నాయకులు సోమవారం మధ్యాహ్నం రాస్తారోకో చేపట్టారు. జిల్లా కార్యదర్శి దావూద్ మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా గుంతలుగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విచ్చలవిడిగా ఇసుక లారీలకు అనుమతులు ఇవ్వడంతో రోడ్డు ద్వంసమైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలను నియంత్రించాలని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.