కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ పేరుతో సీబిఐ కి అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సెంటర్ లో బీఆర్ఎస్ నగర కమీటీ అధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రేస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ధ్వజం ఎత్తారు. బీఆర్ఎస్ నాయకుల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు.