కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి ప్రవేశపెట్టడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన ఆటో టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నిరసిస్తూ గురువారం పలాస ఆర్డిఓ కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి రావు ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గణపతి రావు మాట్లాడుతూ... ప్రస్తుతం నిత్యావసర వస్తువులతో పాటు.. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయని ఆటో కార్మికులకు తక్షణమే ప్రభుత్వం ఏడాదికి రూ. 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.