మోతీ నగర్ లోని ఇందిరమ్మ క్యాంటీన్లో ఐదు రూపాయలకే అల్పాహారం పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరే కృష్ణ మూమెంట్ సహకారంతో హైదరాబాదులో 150 కేంద్రాలలో ఈ పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మికులు విద్యార్థులు పేద వర్గాలకు ఇది పెద్ద సహాయం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.