విశాఖలోని ఎం.వి.పి. కాలనీలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్.జి.ఓ. ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు.ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు.