ఇటీవల 10వ తరగతి, ఇంటర్మీడియట్, బి.టెక్ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు ఉద్యోగుల పిల్లలను జిల్లా SP వకుల్ జిందల్, పోలీసు కార్యాలయంలో అభినందించి, ప్రశంసా పత్రాలను, మెరిట్ స్కాలర్ షిప్ లను ఆగస్టు 30న అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా SP వకుల్ జిందల్ మాట్లాడుతూ ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి, మంచి ఫలితాలను సాధించాలన్నారు. చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని, ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను