కూటమి ప్రభుత్వం ఎరువులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని వైఎస్ఆర్సిపి గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం నగరంలోని ఆమె కార్యాలయంలో ఎరువుల కొరతపై వైఎస్ఆర్సిపి ఈనెల 9 తేదీ చేపట్టిన 'అన్నదాతల పోరు' పోస్టర్స్ ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ అన్నదాతలను ఎరువులు కోసం క్యూ లైన్లో నుంచో పెడుతున్న కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.