నల్లగొండ జిల్లా:శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వినాయక విగ్రహాల శాంతి కమిటీని ఏర్పాటు చేసి అందరితోటి కలిపి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.మండల వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు అందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు.డీజీలు నిర్వహించకూడదని వినాయక మండపాల వద్ద శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైకులు పెట్టకూడదని తెలిపారు ప్రతి ఒక్కరు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని పోలీస్ స్టేషన్ నందు ఫామ్స్ ను అందజేయాలన్నారు.