నంద్యాలలో చిన్న చెరువులో నిర్వహించిన గణేష్ నిమజ్జనం మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్సీ ఆదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. నిమజ్జన మహోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. నేడు నిమజ్జనా కార్యక్రమానికి చిన్న చెరువు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు పూర్తిచేయడం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.