ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంటవానిపల్లి రహదారిపై తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు గంటవానిపల్లి రహదారిని స్థానిక నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. త్వరలో సమస్యను పరిష్కరించి రహదారిపై బ్రిడ్జి నిర్మిస్తామని గ్రామస్తులకు తెలియజేసినట్లు తెలిపారు.