యాదాద్రి భువనగిరి జిల్లా: పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా ఈ ఘటన భూతాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామ శివారులో గల ఓ వెంచర్లో చోటుచేసుకుంది ఎస్ఐ భాస్కర్ రెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం జలాల్పూర్ గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్ రెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన పాలకొర్ల జంగయ్య చెక్క నరేష్, సామల సుధాకర్ రెడ్డి,కంది మహేందర్ పాలకొర్ల ఉపేందర్ ప్రశాంత్ గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని విశ్వసిని సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.