సిర్పూర్ టి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతుల కంటే బీహార్ ఎన్నికలే ముఖ్యమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ బిజెపి బ్లాక్ దండాలే కారణమని అందుకే కేసిఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు,