ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం డోలారా సమీపంలోని పెనగంగా నది వద్ద వినాయక నిమజ్జన ప్రక్రియను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఆదిలాబాద్ నుంచి వస్తున్న వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.