కుందుర్పి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కుందుర్పి మండలం సమాచార హక్కు చట్టం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గౌరవాధ్యక్షులుగా గోపాల్, గౌరవ ఉపాధ్యక్షులుగా కోదండరాములు, అధ్యక్షులుగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా ప్రకాష్, కార్యదర్శిగా రంగస్వామి, సహాయ కార్యదర్శిగా జాకీ, కోశాధికారిగా గోవిందరాజులు, మహిళా విభాగం అధ్యక్షురాలుగా కవిత, మరో 20 మంది సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం కృషి చేస్తామన్నారు.