ఘనపూర్ గ్రామ శివారులోని గౌతాయ చెరువుకు మరమ్మతులు తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ శివారులోని గౌతాయ చెరువుకు ఇరిగేషన్ అధికారులు గురువారం మధ్యాహ్నం మరమ్మతులు చేపట్టారు. ఘనపూర్ గ్రామంలో పెద్ద చెరువుగా ఉన్న గౌతాయ చెరువు మత్తడి తూము వద్ద నుంచి నీరు లీకేజీ అవుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించగా డీఈ శ్రీకాంత్, ఏఈ అనురాధ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో లీకేజీలను పూడ్చివేశారు.