ఓర్వకల్లు మండలంలో రాక్ గార్డెన్ ను పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతపురం నుంచి విజయవాడకు ప్రయాణం మధ్యలో కర్నూలు చేరిన మంత్రి కందుల దుర్గేష్ రాక్ గార్డెన్‌ను సందర్శించి, మాట్లాడారు. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతివనం, చెరువు, ఆకర్షణీయ రాళ్ల ఆకృతులు అపూర్వమైన ప్రకృతి అందాలని మంత్రి అభివర్ణించారు. రాక్ గార్డెన్‌లో టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.