తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బొజ్జ సతీష్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు పిఠాపురం అభివృద్ధి, రైతుల సంక్షేమం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.