ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఎక్కడ ఎటువంటి యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు అన్నారు. రాచర్ల మండలం మెట్ట ప్రాంతం కావడంతో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కొత్తిమీర, మినుము, పెసర, కొర్ర పంటలు వేశారని చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. పత్తి పంట కూడా చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. పైన తెలిపిన పంటలకు మందులు వాడవలసిన అవసరం ఉండదని ప్రస్తుతం వరి కొంత మేరకు సాగు దిశలో ఉందని మరి రైతులకు కూడా యూరియా అందుబాటులో ఉన్నట్టు అన్నారు. యూరియా అవసరమైన వారు మీ స్థానిక రైతుసేవ కేంద్రాలను సంప్రదించాలన్నారు.