శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. సమాజ శ్రేయస్సు కోసం మరియు పేదల పక్షాన అలుపెరుగకుండా పోరాటం చేసిన మహా యోధుడు సురవరం ప్రతాపరెడ్డి అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.