దివ్యాంగుల పెన్షన్లలో దిగజారుడు తత్వం ప్రదర్శిస్తే ఊరుకోమని వికలాంగుల సంఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం కర్నూలు నగరంలోని కార్మిక–కర్షక భవన్ వద్ద ఉన్న రజక సంఘం జిల్లా కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.జిల్లా అధ్యక్షురాలు రాజామనెమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఆనంద్ బాబు, ఎన్‌పిఆర్డీ కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు రాధ, వికలాంగుల సాధికార ఫోరం నాయకులు నాగరాజు, శివశంకర్, వెంకటేష్, డిఆర్డబ్ల్యుఎఫ్ నాయకులు మస్తాన్ వలి, వికలాంగుల ఆదరణ సేవా సమితి నాయకులు మరియదాసు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, రజక సం