యాదాద్రి భువనగిరి జిల్లా: మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నోటి దూలతో ఇష్ట వచ్చినట్లుగా బజార్ మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్న విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపు నేతలను ఆడ మగ కాదంటూ మాట్లాడడం దిగజారుడు తలమేనని ఆయన మండిపడ్డారు.