గుండాల మండలంలో.. గత మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నెరసాని, ఏడు మెలికల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏడు మెలికల వాగు ఉధృతికి మూడు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కొడవటం, నాగారం, పాలగూడెం మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర సరుకులు కొనాలన్న వాగు దాటి గుండాలకు రావాల్సిందే. ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో భారీగా వర్షాలు కురవటం వలన కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో లోలెవెల్ బ్రిడ్జి మీదుగా ఏడు మేలుకల వాగు ప్రవహించడం వలన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా తమకు ఐలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.